సెలబ్రిటీలు విలాసవంతమైన బంగళాల్లో జీవించడం సహజం. తమ స్థాయికి తగ్గట్టు జీవితాన్ని గడుపుతారు. ఈ కల్చర్ బాలీవుడ్లో ఎక్కువగా కనిపించినప్పటికీ.. దక్షిణాదిలోనూ కాస్త అటు ఇటుగా కొంతమంది అలాంటి లైఫ్నే కోరుకుంటారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కుటుంబం కూడా చాలా కాలం అలాంటి విలాసవంతమైన భవంతిలోనే ఉంది. చెన్నై ఈసీఆర్ లో ఆ దంపతులకు 15 వేల చదరపు అడుగుల్లో విస్తరించిన విలాసవంతమైన భవంతి ఉంది. ఆ ఇంటికి ఏడు ద్వారాలు ఉన్నాయి. కొన్నేండ్లుగా అందులోనే నివాసం ఉన్న రాధికా - శరత్ ఆ ఇంటిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో 15 మంది పనివాళ్లు ఉన్నప్పటికీ.. రోజూ ఇంటిని చూసుకోవడం, రాత్రి సమయంలో ఆ ద్వారాల వద్ద ఉన్న గడియలు పెట్టడం ఇబ్బందిగా మారిందట. పిల్లలకు పెళ్లిళ్లు అయిపోవడం.. కొడుకు విదేశాల్లో ఉండటంతో అంత పెద్ద ఇంట్లో ఇద్దరు ఉండటం నచ్చలేదట. దీంతో తమ విలాసవంతమైన భవంతిని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అద్దెకిచ్చి.. చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం రాధిక, శరత్ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.