Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూత

Update: 2024-06-08 04:36 GMT

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. BSc చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని వివాహమాడారు. 1962లో ‘మార్గదర్శి’ని ప్రారంభించారు. అదే ఆయన తొలి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ‘ఈనాడు’ను స్థాపించారు. ఫిల్మ్‌సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

Tags:    

Similar News