Shruthi Haasan : అలసిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది : శృతి హాసన్

Update: 2024-02-20 04:51 GMT

కమల్ హాసన్ (Kamal Hasan) కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ శృతి హాసన్ (Shruthi Haasan). కమల్ కూతురిగానే కాకుండా తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. తండ్రి వలె ఎప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ.. తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఓ వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరో వైపు చిన్న సినిమాల్లో ఐటం సాంగ్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న శృతి.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకెప్పుడు వర్క్ ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చింది. కష్టపడి పని చేయడమంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. మానసికంగా, శారీరకంగా అలసిపోతేనే ప్రశాంతంగా ఉంటుందని పేర్కొంది.

రోజంతా కష్టపడి పని చేసి అలసి పోయి ఇంటికి వెళ్తే మంచి అనుభూతి కలుగుతుందని వ్యాఖ్యానించింది. అలసిపోవడంతో వచ్చే అనుభూతిని మించింది మరొకటి లేదంది. ఇక సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా విడుదలైన సలార్ సినిమాతో మంచి హిట్ అందుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ది చెన్నై స్టోరీ పేరుతో రూ పొందుతున్న చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపికైంది. బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Tags:    

Similar News