Actress Regina : యాక్టింగ్‌ మానేయాలనుకున్నా.. రెజీనా సంచలన కామెంట్స్

Update: 2025-07-23 10:45 GMT

నటి రెజీనా కసాండ్రా తన సినీ కెరీర్‌లో ఒకానొక సమయంలో నటనను ఆపేయాలని ఆలోచించినట్లు ఇటీవల వెల్లడించారు. తాను టీనేజ్‌లో ఉండగానే సినిమాల్లోకి వచ్చానని, అప్పట్లో పరిశ్రమ పరిస్థితులు, స్టార్‌డమ్ అంటే ఏంటో తనకు పెద్దగా అవగాహన లేదని ఆమె తెలిపారు. నటించడం ఒక సాహసకృత్యంగా భావించానని చెప్పారు. కాలం గడిచేకొద్దీ సినిమా ప్రపంచాన్ని, తనను తాను అర్థం చేసుకున్నానని రెజీనా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఇటీవల, ఆమె బాలీవుడ్‌లో "జాట్", "కేసరి ఛాప్టర్ 2" వంటి విజయవంతమైన చిత్రాల్లో కనిపించారు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రాబోయే "ది వైఫ్స్" అనే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో భార్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెజీనా కెరీర్‌లో "శివ మనసులో శృతి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత "రొటీన్ లవ్ స్టోరీ", "కొత్త జంట", "పిల్లా నువ్వు లేని జీవితం", "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్", "ఎవరు" వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆమె గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పించారు.

Tags:    

Similar News