పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్’ మూవీ రీరిలీజ్ కానుంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ 2012 మే 11న విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 150 కోట్ల వసూళ్లను సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ దబాంగ్‌కు రీమేక్‌గా రూపొందింది. పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.