మెగా హీరో రాంచరణ్, కియారా అద్వానీ, అంజలీ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇప్పటికే భారీ ప్రమోషన్స్ నిర్వహించారు. గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.మెగా ఫ్యాన్తో పాటు ఇతర అభిమా నులు కూడా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. అయితే గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రత్యేకంగా నైజాం ఏరియాలో అర్ధరాత్రి సమయంలో ఓపెన్ చేసిన అడ్వాన్స్డ్ బుకింగ్స్ గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లో పలు మల్టీప్లెక్సుల్లో తొలి రోజుకు పూర్తిగా ఫుల్ అవ్వడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన గంటలోనే ఈ చిత్రం నైజాం ఏరియాలో కోటి గ్రాస్ ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.