టాలీవుడ్ హీరో గోపిచంద్ మొదటిసారిగా ఓ హిస్టారికల్ మూవీలో నటిస్తున్నాడు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్పరెడ్డి ఈ సినిమాకు డైరెక్టర్. గురువారం గోపిచంద్ బర్త్ డే సందర్భంగా టీమ్ స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేసింది. ‘అతడో యోధుడు విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ వీడియోను పంచుకుంది. గోపిచంద్ డైనమిక్ వారియర్ గా కనిపిస్తున్నాడు. సింపుల్ విజువల్స్, మంచి బీజీఎంతో వచ్చి ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.