ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంతో మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆర్.నారాయణమూర్తి ఆరోగ్యం స్థిరంగా ఉందని మంత్రికి నిమ్స్ డైరెక్టర్ వివరించారు. వైద్య పరమైన టెస్టులను చేస్తున్నట్లు వివరించారు.
మరోవైపు తన అనారోగ్యంపై నారాయణమూర్తి స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన విజ్ఞప్తిచేశారు.