ఎన్టీఆర్ ‘దేవర పార్ట్-2’లో భారీ యాక్షన్ సీన్లు, ట్విస్టులు ఉండేలా డైరెక్టర్ కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, స్క్రిప్ట్‌లో భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. పుష్ప-2 తరహాలో ఫ్యాన్స్‌ను మెప్పించేలా సీన్స్ రాసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. . అలా స్క్రీన్ ప్లే ఉంటేనే దేవర 2 నార్త్ ఆడియెన్స్‌కు మరింత చేరువ అవుతుందని కొరటాల ఆశిస్తున్నారు. కెజిఎఫ్ 2, బాహుబలి 2, పుష్ప 2 తరహాలో గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్స్ మూడు నాలుగు సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. రెండో భాగంలోనూ పెద్ద దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ గంటకు పైగానే ఉండొచ్చని సమాచారం. దేవర-2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.. సముద్రంలో కళేబరాలు, దేవర అదృశ్యం, భైర చేసిన అరాచకాలు, ఎర్ర సముద్రం మీద జరిగిన యుద్ధాలు వగైరాలన్నీ ఇందులో పొందుపరచబోతున్నారు. కాగా దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే జాన్వీ కపూర్ కూడా రామ్ చరణ్ సరసన ‘RC-16’ మూవీలో నటిస్తోంది. దీనికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.