ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్(65) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున్నారని, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్(1995)’ సినిమాలో టైటిల్ రోల్‌తో కిల్మర్ ప్రసిద్ధి పొందారు. టాప్ గన్, టాప్ గన్: మావ్రిక్, విల్లో, ది డోర్స్, టాప్ సీక్రెట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.కిల్మర్ 1984లో 'టాప్ సీక్రెట్' అనే ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 'టాప్ గన్', 'రియల్ జీనియస్', 'విలో', 'హీట్', 'ది సెంట్', ది డోర్స్', 'బ్యాట్మన్ ఫోరెవర్', 'రియల్ జీనియస్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్, డెన్జెల్ వాషింగ్‌టన్ వంటి ప్రముఖ నటీనటులతో వాల్ కలిసి పనిచేశారు.