Madhubala : ఇష్టం లేనప్పటికీ ఆ షరతును బ్రేక్ చేశా : మధుబాల

Update: 2025-06-21 09:30 GMT

మణిరత్నం తెరకెక్కించిన రోజా మూవీలో అరవిందస్వామికి జోడిగా నటించింది మధుబాల. అందులో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సహాయ నటి పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తోన్న ఆమె మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప కోసం పని చేస్తోంది. సినీ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు తనకు తానుగా కొన్ని రూల్స్ పెట్టుకుందట మధుబాల. అందులో ఒకటి లిప్ కిస్ . తనకు ఇష్టం లేనప్పటికీ ఆ షరతును బ్రేక్ చేయక తప్పలేదట ఆమెకు. తీరా సెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత కిస్ సీన్ చేయాలని టీమ్ చెప్పడంతో అంగీకరించక తప్పలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఆ సీన్లో నటించేందుకు తాను చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. తనకు తాను విధించుకున్న నిబంధన పక్కనబెట్టి లిప్ కిస్ సీన్ లో నటించినప్పటికీ తీరా ఎడిటింగ్ లో ఆ సీన్ కట్ చేశారట

Tags:    

Similar News