శివ మనసులో శృతి మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఆతర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కనిపించినా? కోలీవుడ్.. బాలీవుడ్ లో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది. సొంత భాష తమిళం అమ్మడిని బాగా ఆదుకుంది. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని ఖాళీ లేకుండా పనిచేస్తోంది. వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ సైతం చేస్తూ అలరిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన 'జాట్', 'కేసరి చాప్టర్ 2'చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. తాజాగా రెజీనా సౌత్.. నార్త్ భామలను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. 'నేను పంజాబీ అమ్మాయి క్యారెక్టరే చేయలేను. ఒకవేళ ఒప్పుకున్నా అది పరిపూర్ణం కాదు. కానీ ఒక పంజాబీ అమ్మాయి సౌత్ లో ఎలాంటి పాత్ర వచ్చినా పోషించగలదు. అలాంటి వారిని చాలా క్లోజ్ గా చూసాను. సొంత భాషలో సినిమాలు చేయడం ఏ నటికైనా కంపర్ట్ గానే ఉంటుంది. ఎలాంటి పాత్ర పోషించినా అది ప్రభావవంతంగా ఉండాలి. రెజీనా మంచి క్యారెక్టర్ చేసిందని అందరూ మాట్లాడుకోవాలి. అంత ప్రభావాన్ని చూపగలిగే స్థాయికి చేరుకోవాలన్నదే నా కోరిక. సౌత్ భామలు నార్త్ లో ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందుకు భాష అడ్డంకిగా మారకూడదు' అంటూ చెప్పుకొచ్చింది.