Vidya Balan : అతడు కోరిన కచ్చితత్వం వచ్చే వరకూ అలా చేయాల్సిందేనట : విద్యా బాలన్
ఎంచుకున్న రంగంలో పరిపూర్ణం కావాలంటే పట్టుదల.. సహనం.. క్రమశిక్షణ.. ఇలా అన్ని విషయాల్లో చక్కగా ఉండాలి. ఇక ఆ రంగంలో ప్రోత్సహించేవారు ఉంటే మార్గం మరింత సులభం అవుతుంది. ప్రతి సన్నివేశంలో ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలో కి తీసుకొని జాగ్రత్తగా నటిస్తుంది కాబట్టే సీనియర్ నటి విద్యా బాలన్ బాలీవుడ్లోని ఆర్టిస్టుల్లో పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఆమెకు ఇంతటి పర్ఫెక్షన్ రావడానికి పునాది వేసింది దాదాగా పిలుపందుకున్న దివంగత దర్శకుడు ప్రదీప్ సర్కార్ . 2005లో విడుద లైన పరిణీత మూవీ రీమాస్టర్ చేసి తిరిగి ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భం గా తన గురువును గుర్తు చేసుకుంది విద్యా బాలన్ ఒకసారి తాను పాటలోని ఒక లైన్ కు కన్నీటి చుక్కను సరైన టైమ్ కు రాబట్టడానికి 28 టేకులు తీసుకుందట. అతడు కోరిన కచ్చితత్వం వచ్చే వరకూ ఎవరైనా ఆర్టిస్ట్ అలా చేయాల్సిందేనట.ఆయన మార్గదర్శకత్వంలో తాను క్రాఫ్ట్లోని ప్రతి వివరం ఎలా గమనించాలో నేర్చుకుందట. 20 ఏండ్లుగా తనతో ఉన్న హెయిర్ స్టైలి స్ట్ శలక కూడా దాదా నుంచి ప్రతిదీ నేర్చుకున్నాడని చెప్పింది. అది తమ అందరికీ ఆయన ఇచ్చిన బహుమతి అని పేర్కొంది.