Salaar Postponed: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. రిలీజ్ పై అనిశ్చితి
'సాలార్' పోస్ట్ పోన్ కానుందా.. ఎందుకంటే..;
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా 'సాలార్' వాయిదా పడిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మొదట సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావించిన మేకర్స్.. ఈ చిత్రాన్ని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్‌లో విడుదల అవుతుందని భావించారు కానీ ఇప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం రాలేదు.
గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవుతుందా?
'సాలార్' విడుదల తేదీని మేకర్స్ మరో 27 రోజులు వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాణ బృందం గ్రాఫిక్స్ వర్క్‌ను పూర్తి చేయడంలో సమస్యలే ఇందుకు కారణమని సమాచారం. సెప్టెంబర్ 28 నాటికి దీన్ని పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. దీంతో సినిమా విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఆలస్యంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
సాలార్ గురించి
రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న, ప్రభాస్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. సాలార్‌లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, శృతి హాసన్, టీనా ఆనంద్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక 'సాలార్' పార్ట్ 2లో జగపతి బాబు పాత్ర ప్రముఖంగా కనిపిస్తుండడంతో సీక్వెల్‌కు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రం ప్రాంతీయ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా విడుదల కానుంది. ఇది పాన్-ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది.
టీజర్‌కి రియాక్షన్
జూలైలో ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "కృతజ్ఞతతో పొంగిపోయాము! భారతీయ సినిమా పరాక్రమానికి ప్రతీక అయిన 'సాలార్' విప్లవంలో అంతర్భాగంగా ఉన్నందుకు, మీలో ప్రతి ఒక్కరి నుండి మాకు లభించిన పొంగిపొర్లుతున్న ప్రేమ, మద్దతుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా అద్భుతమైన అభిమానులకు అద్భుతమైన ప్రశంసలు. భారతీయ చలనచిత్రం సాలార్ టీజర్‌ను 100 మిలియన్ల వీక్షణలు దాటి ముందుకు నడిపించినందుకు మీ అచంచలమైన మద్దతు మా అభిరుచికి ఆజ్యం పోస్తుంది. నిజంగా అసాధారణమైనదాన్ని అందించడానికి మమ్మల్ని ఇది నడిపిస్తుంది" అని హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ పేజీలో ఒక పోస్ట్ చేసింది.
ఇక ప్రస్తుతం, ప్రభాస్ ఏకకాలంలో 'కల్కి' 2898 పేరుతో మరో సినిమా చేస్తున్నాడు. సూపర్ హీరో కథాంశంతో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.