యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలసి నటించిన వార్ 2 సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు తారక్. ఈ నెల 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ 'ఎస్క్వైర్ ఇండియా' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బలమైన కథతో వార్2 రాబోతోందని.. ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. ‘‘భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త అనుభూతిని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. వార్ 2 లో నా పాత్ర అలాంటిదేనని, నటుడిగా ఇది నాకు సవాల్ విసిరింది’’ అని తారక్ అన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని చెప్పారు.
అదేవిధంగా కుటుంబ వారసత్వానికి సంబంధించి కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారసత్వం విషయంలో ఏం జరుగుతుందో తెలియదని... తాను ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పాడు. ఒక నటుడిగా కన్నా ఒక నిజాయితీ గల వ్యక్తి గా తనను గుర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం వంట చెయ్యడం తనకెంతో ఇష్టమని తెలిపారు. పునుగులు బాగా వేస్తానని, తాను వండే బిర్యానీ కూడా అందరికీ నచ్చుతుందన్నారు. వచ్చిన అవకాశాలను నిజాయతీగా వినియోగించుకుంటానని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.వార్ 2 మూవీ అందుకే చేశాను.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలసి నటించిన వార్ 2 సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు తారక్. ఈ నెల 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ 'ఎస్క్వైర్ ఇండియా' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బలమైన కథతో వార్2 రాబోతోందని.. ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. ‘‘భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త అనుభూతిని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. వార్ 2 లో నా పాత్ర అలాంటిదేనని, నటుడిగా ఇది నాకు సవాల్ విసిరింది’’ అని తారక్ అన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని చెప్పారు.
అదేవిధంగా కుటుంబ వారసత్వానికి సంబంధించి కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారసత్వం విషయంలో ఏం జరుగుతుందో తెలియదని... తాను ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పాడు. ఒక నటుడిగా కన్నా ఒక నిజాయితీ గల వ్యక్తి గా తనను గుర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం వంట చెయ్యడం తనకెంతో ఇష్టమని తెలిపారు. పునుగులు బాగా వేస్తానని, తాను వండే బిర్యానీ కూడా అందరికీ నచ్చుతుందన్నారు. వచ్చిన అవకాశాలను నిజాయతీగా వినియోగించుకుంటానని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.