Kalki North America Records : నార్త్ అమెరికాలో కల్కి అత్యధిక వసూళ్లు

Update: 2024-07-15 05:08 GMT

నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. అక్కడ ఈ మూవీ 17 రోజుల్లోనే 17.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. షారుఖ్‌ఖాన్ పఠాన్($17.49M) కలెక్షన్స్‌ను అధిగమించింది. టాప్ ప్లేస్‌లో బాహుబలి-2 ($20.7M) కొనసాగుతోంది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో రూపొందించారు. దీంతో అక్కడి ప్రేక్షకులనూ ఈ సినిమా మెప్పిస్తోంది. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News