‘మహానటి’ కీర్తిసురేశ్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌పై కన్నేశారు. ‘బేబీ జాన్’తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం అక్క, రివాల్వర్ రీటా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఏఐ చాట్ జీపిటీ క్రియేట్ చేస్తున్న గిబిలి ఫోటోలను షేర్ చేసింది కీర్తి. తాజాగా ఆమె ఫోటోస్ నెట్టింట ఆక్టటుకుంటున్నాయి. ఈ ఫోటోస్ చూసి బ్యూటీఫుల్.. క్యూటీ అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు హిందీలో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.