Tollywood : వారణాసి సెట్ లో రాజమౌళి-మహేశ్ మూవీ కీలక సన్నివేశాల చిత్రీకరణ

Update: 2025-05-03 12:30 GMT

టాలీవుడ్ సినిమాల్లో వారణాసి నగరానికి ప్రత్యేకత ఉంది. చాలా సినిమాలు వారణాసి నేపథ్యంలో రూపొందాయి. తాజాగా వచ్చిన ప్రభాస్ కల్కి చిత్రంలో కూడా వారణాసి ఉంటుంది. ఇప్పుడు మహేష్బాబు సినిమా కోసం కూడా వారణాసి నగరాన్ని సృష్టిస్తున్నారని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం కోసం ఇటీవలే తాజా షెడ్యూల్ పూర్తిచేశారు. ఆ తర్వాత చిత్రీకరణ కోసం యూనిట్ సన్నద్ధమవుతోంది. జూన్ పదవ తేదీన తదుపరి చిత్రీకరణ మొదలవుతుందని తెలిసింది. వారణాసి సెట్ కోసం ఆర్ట్ డిపార్టుమెంట్ శ్రమిస్తోంది. ఇందులోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సెట్ కి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది మాత్రం వచ్చే ఏడాది మాత్రమే. ఇందులో మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నానా పటేకర్ కీలక పాత్రధారు. సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో డా.కేఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News