ఒకప్పుడు బెంగాల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా మా కాళి సినిమాను రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. “మా కాళి”గా రైమా సేన్, ఐఎఎస్ అధికారిగా మారిన నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు.
బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమే 'మా కాళి'. బెంగాల్‌లో స్వాతంత్ర్యం సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. 1946లో బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో 'మా కాళి' టీజర్ మొదలవుతుంది.
'కశ్మీర్ ఫైల్స్', 'కేరళ స్టోరీ' తరహాలోనే 'మా కాళి' కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, బెంగాలీలో కూడా విడుదల కానుంది.