Mamitha Baiju : ఒక్క మూవీతోనే .. మోస్ట్ బిజీ హీరోయిన్ గా మమిత బైజ్

Update: 2025-07-15 09:45 GMT

ప్రేమలు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ మమిత బైజ్. ఇందులో పక్కింటి అమ్మాయి పాత్రలో అల్లరి చేస్తూ మెప్పించింది. తన నటనతో అందరి ప్రశంసలు పొందింది. తొలి మూవీతోనే యూత్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. దీంతో పలు భాషల్లో దక్కించుకుంది. ఒక్క మూవీతోనే అనేక అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా జన నాయకుడులో కీలక పాత్ర చేస్తుంది. ధనుష్, సూర్య వంటి అగ్రశ్రేణి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రదీప్ రంగనాథన్, సంగీత్ ప్రతాప్ వంటి యంగ్ హీరోల అప్ కమింగ్ మూవీల్లోనూ చాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇక మలయాళ హీరో నివిన్ పౌలీ మూవీలోనూ ఫిమేల్ లీడ్లో నటించేందుకు ఎంపికైంది. అంతే కాదు.. తన తొలి మూవీ ప్రేమలు సీక్వెల్కు కూడా సన్నాహాలు చేస్తున్నారట. ఇలా పలు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ చేతినిండా మూవీలతో బిజీబిజీగా గడి పేస్తున్న మమిత.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్న, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కంటే కూడా ఈమె బిజీగా ఉంది.

Tags:    

Similar News