కృష్ణ వంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, సోనాలిబింద్రే కాంబినేషన్ లో వచ్చిన రూపుదిద్దుకున్న మూవీ మురారి. ఫిబ్రవరి 17, 2001న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆగస్టు 9న ఘట్టమనేని సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ సందర్భంగా మహేశ్ నటించిన కల్ట్ క్లాసిక్ లో ఒకటైన మురారి చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా చేశారు. ఇందుకు గాను ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన ప్రతీకలను డిజైన్ చేసి ప్రతి ఒక్క అభిమానిని ఆహ్వానిస్తున్నారు. 'ఘట్ట మేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి - అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చి"లా"సౌ. వసుంధర కు ఇచ్చి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్ల పక్ష త్రయోదశి నాడు అనగా ఆగస్టు 9న వివాహం జరిపించుటకు నిశ్చయిం చినారు. కావున తామెల్లరు విచ్చేసి, మా ఆతిథ్యం స్వీకరరించి వేద పండితుల సాక్షిగా ఒక్కటవుతున్న మా చిరంజీవులు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము’అంటూ వివాహ పత్రికను ముద్రించండం విశేషం. ప్రస్తుతం ఈ వివాహ పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మురారి తో పాటు ఒక్కడు సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు.