Nagababu Viral Post : బిగ్ బాస్ కంటెస్టెంట్ కు బెస్ట్ విషెస్.. నాగబాబు పోస్ట్ వైరల్..

Update: 2025-09-08 11:30 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'లో అడుగు పెట్టిన నటుడు భరణి శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు నాగబాబు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగబాబు ట్వీట్ చేశారు. "నా ప్రియమైన భరణి శంకర్, బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెడుతున్నందుకు హార్దిక శుభాకాంక్షలు. ఈ ప్రయాణం ఆయనకు తగిన గుర్తింపు, విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను," అని నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే భరణి శంకర్ పై హై బజ్ ఏర్పడింది. ఆయనకు ఉన్న క్రేజ్‌తో పాటు, నాగబాబు మద్దతు కూడా తోడవడంతో హౌస్ లో ఆయన కీలకంగా మారారు. ఇప్పటికే భరణికి మద్దతుగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News