యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం టాక్సిక్ . కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టాక్సిక్ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో నయనతార భాగమైనట్లు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు తాను యశ్ సినిమా షూటింగ్ లో ఉన్నానని చెప్పిన ఆయన ఈ మూవీలో నయనతార నటిస్తోందని హింట్ ఇచ్చాడు. ఇంతకు మించి వివరాలను తాను వెల్లడించలేనని, త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. అప్పటి వరకు వేచిచూడాలని అన్నారు. నయనతార ఏ పాత్రలో కనిపించనుందనే దానిపై స్పష్టత లేదు. ఇందులో కరీనాకపూర్, కియారా అద్వానీ కూడా నటించునున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వీటిపై గతంలో టీమ్ స్పందిస్తూ అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని కోరింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నయన తార యశ్ సరసన నటిస్తుందా.. లేక మరేదైనా పాత్రలో నటించబోతుందా? అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారు. అయితే ఈసినిమాలో నటించేందుకు నయన్.. ఏకంగా రూ. 10కోట్లు డిమాండ్ చేసిందంట.