హీరో సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మిస్ యూ. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రమోషన్స్ లో మిస్ యూ సినిమా విడుదలైన వారానికే పుష్ప 2 థియేటర్లలో వస్తుంది భయం లేదా ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా. దానికి సమాధానంగా సిద్దార్థ్ మాట్లాడుతూ "మీరు చెప్పింది కరెక్టే. కానీ, రెండో వారం కూడా నా సినిమా థియేటర్లలో ఉండాలంటే చాలా విషయాలు జరగాలి. మొదట నా సినిమా బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలి. నా సినిమా బాగుంటే థియేటర్లలో ఉంటుంది. ఈ కాలంలో ఒక మంచి సినిమాను థియేటర్ల నుండి తీసేయలేరు. కాబట్టి మిస్ యూ సినిమాపై పుష్ప 2 ఎలాంటి ప్రభావం చూపదు" అంటూ చెప్పుకొచ్చాడు.