ఆపరేషన్ సిందూర్... నిన్నటికి నిన్న వెలుగులోకి వచ్చిన ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ ఉగ్రవాద క్యాంపులపై చేపట్టిన దాడికి పెట్టిన పేరిది. ఇప్పుడితే పేరుతో సినిమా తీసేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నా యి. ఒకటి, రెండు సంస్థలు కాదు సుమారు 15 నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం పోటీలో ఉన్నాయి. టీ సిరీస్, జీ టీని స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లు కూడా ఆ టైటిల్ కోసం పోటీ పడుతున్న జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో నిర్మాతలు దరఖాస్తు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. మహవీర్ జైన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఈ టైటిల్ కోసం ముందుగా దర ఖాస్తు చేసుకుంది. ఆప రేషన్ సిందూర్ టైటిట్ కోసం దరఖాస్తు చేసు కున్న జియో స్టూడి యోస్ ఆ తర్వాత తన అప్లికేషన్ ను విత్ డ్రా చేసుకుంది. తమ అనుమతి లేకుండా ఒకరు కంపెనీ తరుపన దరఖాస్తు చేసినట్లు చెప్పింది. ఇన్ని సంస్థలు పోటీ పడుతున్న టైటిల్ ఎవరిని వరించనుందో? సినిమా కథ ఎలా ఉంటుందో? ఎప్పటిలోగా తెరకె క్కిస్తారో వేచిచూడాలి.