Pawan Kalyan : వైసీపీ సర్కార్ లోపభూయిష్టమైన విధానాల వల్లే ఏపీలో విద్యుత్ సంక్షోభం : పవన్ కళ్యాణ్
Pawan Kalyan : వైసీపీ సర్కార్ లోపభూయిష్టమైన విధానాల వల్లే ఏపీలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.;
Pawan Kalyan : వైసీపీ సర్కార్ లోపభూయిష్టమైన విధానాల వల్లే ఏపీలో విద్యుత్ సంక్షోభం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. 200 యూనిట్ల వరకు ఉచితం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్.. అల్పాదాయ వర్గాలపై 57 శాతం అదనంగా బాదుతోందని మండిపడ్డారు. దీంతో వైసీపీ మాటలకు అర్థాలే వేరులా అనేలా పరిస్థితి ఉందన్నారు. మిగులు విద్యుత్‌తో ఉన్న రాష్ట్రాన్ని.. పవర్ హాలిడే వరకు తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో.. పట్టణాల్లో.. నగరాల్లో గంటలకొద్దీ విద్యుత్ కోతలతో అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.