ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఆదుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే పరిశ్రమ టాలీవుడ్. మొన్నటి మొన్న వయనాడ్ విధ్వంసానికి కేరళ హీరోల కంటే ముందు స్పందించింది మనవాళ్లు. ఇప్పుడు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలూ భారీగా నష్టపోయాయి. మరి మన ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన హీరోలు ఆగుతారా. వెంటనే రియాక్ట్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదలుపెడితే మిగతా హీరోలంతా ముందుకు తీసుకువెళుతున్నారు. ఎవరికి తోచినట్టుగా వాళ్లు విరాళాలు ప్రకటిస్తూ.. తాము రీల్ లోనే కాదు రియల్ గానూ హీరోలమే అని ప్రూవ్ చేసుకుంటున్నారు.
తాజాగా ప్రభాస్ తన రేంజ్ కు తగ్గట్టుగా రెండు రాష్ట్రాలకు ఒక్కో కోటి చొప్పున రెండు కోట్లు విరాళం ప్రకటించాడు. ఈ మొత్తం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందించబోతున్నారు.
ఇక అల్లు అర్జున్ కూడా తన వంతుగా 1 కోటి ప్రకటించాడు. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు 50లక్షలు, తెలంగాణకు 50 లక్షలు అన్నమాట. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా 1కోటి ప్రకటించాడు. ఈ విరాళాల పరంపర ఇంకా కొనసాగుతుంది కూడా. ఏదేమైనా మన హీరోలు గోట్స్ అనే చెప్పాలి. అదేనండీ.. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అని.