రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘కల్కి 2898 AD’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ విరామంలో ఉన్నాడు. ఆగస్టు నెలలో తదుపరి చిత్రం ‘రాజాసాబ్’ సెట్స్‌లో జాయిన్ అవుతాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.
అసలు విషయానికొస్తే .. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ రొమాంటిక్ డ్రామా ఆగష్టు 22, 2024న అనౌన్స్ అవుతుందని, అదే రోజున సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సెట్స్‌లో కొంత భాగం షూట్ జరగనుండడంతో ప్రత్యేక సెట్‌ను నిర్మిస్తున్నారు. సందీప్ వంగ చిత్రం ‘స్పిరిట్’ కాస్త ఆలస్యం అవుతుండటంతో, ముందుగా రాజాసాబ్, హను రాఘవపూడిల సినిమాల్ని ముగించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు.