Prabhas: త్వరలోనే హాలీవుడ్‌కు ప్రభాస్.. సూపర్ హీరో పాత్రలో..
Prabhas: హాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందట.;
Prabhas (tv5news.in)
Prabhas: ఒకేఒక్క సినిమాతో కొందరి స్టార్ల ఫేట్ అమాంతం మారిపోతుంది. అలా 'బాహుబలి' అనే ఒక్క సినిమా ప్రభాస్ రేంజ్‌నే మార్చేసింది. బాహుబలితో ప్రభాస్ అందుకున్న క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గట్లేదు. పాన్ ఇండియా స్టార్ నుండి మెల్లగా పాన్ వరల్డ్ స్టార్‌గా మారిపోతున్నాడు ప్రభాస్. అందుకే హాలీవుడ్ సైతం ప్రభాస్‌కు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చినట్టు టాక్.
ప్రస్తుతం ప్రభాస్ చేసే సినిమాలో దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో విడుదలవుతున్నాయి. మరికొన్ని భాషల్లో డబ్ అవుతున్నాయి. అందుకే దాదాపు ప్రతీ భాష ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాలోనే కాదు జపాన్, చైనాలాంటి ఫారిన్ దేశాల్లో కూడా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అందుకే హాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందట.
హాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యూనివర్సల్ స్టూడియోస్ కూడా ఒకటి. ఆ యూనివర్సల్ స్టూడియోస్ ఇటీవల ఓ సూపర్ హీరో సినిమా ఫ్రాంచైస్‌లో నటించడానికి ప్రభాస్‌ను సంప్రదించినట్టు సమాచారం. అంతే కాకుండా ఇప్పటికే వారు ప్రభాస్‌తో రెండుసార్లు స్టోరీ సిట్టింగ్‌ను కూడా పూర్తిచేశారట. మరి ప్రభాస్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్న అంశం ఫిల్మ్ సర్కి్ల్లో ఆసక్తికరంగా మారింది.