Kalki Update : ప్రభాస్ 'కల్కి' అప్డేట్.. సాయంత్రం 5 గంటలకు రివీల్

Update: 2024-03-08 07:00 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కల్కి'.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో 'అతని పేరేంటో ఈరోజు సాయంత్రం 5 గంటలకు రివీల్ చేస్తాం అని చిత్రయూనిట్ ట్వీట్ చేసింది.

పోస్టర్ లో శివలింగం ఆకట్టుకుంటుంది. దీంతో మూవీలోని ప్రభాస్ పాత్ర ఏంటో తెలిసిపోనుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'కల్కి' సినిమా మే 9న రిలీజ్ కానుంది.ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతుంది.

Tags:    

Similar News