Pragya Nagra Responds : ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన ప్రగ్యా నగ్రా

Update: 2024-12-08 06:59 GMT

తన పేరిట ప్రచారంలో ఉన్న వీడియో తనది కాదని నటి ప్రగ్యా నగ్రా ట్విటర్లో తెలిపారు. ‘‘అది ఎప్పటికీ నిజం కాదు. ఇదంతా ఓ పీడ కల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయం చేయాలి. కానీ, మన జీవితాల్ని నాశనం చేయకూడదు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో ఓ చెత్త వీడియో సృష్టించి, దాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వరుసగా వస్తున్న ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాలాగా మరో ఏ అమ్మాయికి జరగకూడదని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వాటి విషయంలో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని ఎక్స్‌ వేదికగా స్పందించింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, సైబరాబాద్‌ పోలీస్‌, సైబర్‌ దోస్త్‌, మహారాష్ట్ర సైబర్‌ పోలీసులను ట్యాగ్‌ చేసింది.

Tags:    

Similar News