Priyamani : మణిరత్నం నుంచి చాన్స్ కోసం వెయిటింగ్ : ప్రియమణి

Update: 2025-01-30 12:30 GMT

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది ప్రియమణి. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని చెప్పింది. 'మణి సర్ నుంచి ఫోన్ వస్తే నటించేందుకు వెళ్లిపోతానంతే అంటోంది. ఆయన సినిమాలో నటించడం గొప్ప విషయమని చెబుతోంది ప్రియమణి. ఆయన చేసిన సినిమాలకు మంచి పేరుందంటోంది. గతంలో మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన రావణ్ సినిమాలో నటించింది ప్రియమణి. ప్రస్తుతం మరొక్క చాన్స్ ఇస్తే సంతోషంగా నటిస్తానని చెబుతోందీ భామ.

Tags:    

Similar News