సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా బాక్సఫీ స్ వద్ద హిట్ కావడంతో పుష్ప - 2 తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతోపాటు బన్నీ కి వరల్డ్ లెవల్ పాపు లారిటీని తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప-2కు సీక్వెల్ గా పుష్ప 3 ఉందని అనౌన్స్ చేశాడు సుకుమార్. ఈ సినిమా ఉండదు, ఏదో హైప్ కోసం పార్ట్ 3 అని వేశారని కామెంట్స్ వినిపించాయి. అటు అల్లు అర్జున్ కూడా అట్లీతో సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నెశాడు. అత్యంత భారీ బడ్జెట్ పై సన్ పిచ్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోం ది. కానీ పుష్ప తర్వాత సుకుమార్ ప్రస్తుతం మరేఇతర సినిమా చేయడం లేదు. రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబో ఉండకపోవచ్చు అనే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలకు ఒక్క మాటలో ఫుల్ స్టాప్ పెట్టేశాడు సుకుమార్. దుబాయ్ లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ కార్యక్ర మంలో సుకుమార్ పుష్ప 3 కన్ఫామ్ గా ఉంటుందని చెప్పాడు. ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు.