Radhe Shyam OTT: ఓటీటీలో 'రాధే శ్యామ్'.. కానీ ఆ భాషలో లేదుగా..!

Radhe Shyam OTT: పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో విడుదలయిన తర్వాత ఓటీటీలోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది.

Update: 2022-03-28 15:36 GMT

Radhe Shyam OTT: ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కింది. ఎంతోకాలంగా ప్రభాస్‌ను స్క్రీన్‌పై ప్రభాస్‌ను చూడాలనుకున్న ప్రేక్షకులు.. ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసినా.. చివరికి దీనికి మిక్స్‌డ్ టాక్ లభించింది. అయితే త్వరలో ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో విడుదలయిన తర్వాత ఓటీటీలోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకు కనీసం 90 రోజులు అయినా గ్యాప్ ఉండాలని నిర్మాతలు అప్పుడే నిర్ణయించారు. కానీ రాధే శ్యామ్ విడుదయిన రెండు వారాలకే 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడం, స్క్రీన్స్ అన్నీ ఆర్ఆర్ఆర్‌తో నిండిపోవడంతో థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు అవ్వకముందే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఉగాది సందర్భంగా.. దానికి ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 1న రాధే శ్యామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా సౌత్ భాషలు అన్నింటిలో రాధే శ్యామ్ విడుదల కానుంది. కానీ హిందీలో ఎందుకు విడుదల కావట్లేదు? దానికి వేరే ఓటీటీ ఏమైనా ఉందా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

Tags:    

Similar News