మల్టీస్టారర్ సినిమా అంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ క్రేజే. భారీ వసూళ్లు ఉంటాయి. అందులో నటించే ఇద్దరు స్టార్స్ కు ప్రత్యేకమైన స్టార్ డమ్ ఉండాలి. తాజాగా ఇలాంటి క్రేజ్ కాంబినేషన్ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్నారని తెలిసింది.
ఇటీవలే బాలీవుడ్ లో 'జవాన్' సినిమాతో భారీ విజయం అందుకున్న అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మించనుంది. ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ మల్లీస్టారర్ గా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రోజుల్లో మల్టీ స్టారర్ సినిమాలతోనే జనాలను థియేటర్లకు రప్పించొచ్చని బడా నిర్మాతలు భావిస్తున్నారు.