Rakul Preet Singh : అతి దేనికీ పనికిరాదు.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2025-02-12 05:45 GMT

గాయం నుంచి కోలుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల అయిన గాయం నుంచి నేర్చుకున్న విషయాలను వివరించారు.‘గాయపడిన తర్వాత నా శరీరంపై గౌరవం పెరిగింది. కెరీర్ పై దృష్టిపెట్టడం నేర్చుకున్న. ఏదీ అతిగా చేయకూడదని అర్థమైంది. ఇప్పుడు నేను అందరికీ ఇచ్చే సలహా ఒక్కటే.. మీ శరీరం మాట వినడం. పరిమితికి మించి వ్యాయామం చేయొద్దు. గాయం నుంచి కోలుకొని సెట్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎక్సైట్మెంట్ గానూ ఎమోషనల్ గాను ఉంది. ఇకపై ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా వర్క్ చేయాలి' అని అన్నారు. కాగా.. అర్జున్ కపూర్ హీరోగా ఆమె నటిస్తున్న 'మేరే హస్బెండ్ కీ బీవీ' ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించునున్నారు. ముదస్సర్ అజీజ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ సంయుక్తంగా నిర్మించారు.

Tags:    

Similar News