కన్నడ బ్యూటీ రష్మీక మందన్నా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. స్త్రీ 2 ప్రొడ్యూసర్ దినేశ్ విజన్ మరోసారి తెరకెక్కించబోతున్న 'తమ' సినిమాలో హీరోయిన్ గా నటించనుంది రష్మిక. తాజాగా ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన చేస్తూ వీడియో కూడా విడుదల చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో యుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్త్రీ, భేడియా, ముంజ్యా లాంటి సినిమాలు అందించిన మేకర్స్ ఈ సారి మాత్రం కొంచెం రూటు మార్చి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ సారి బ్లడీ లవ్ స్టోరీ అంటూ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా తెలియజేశారు.