ప్రదీప్ రంగనాథన్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. లవ్ టుడే సినిమాతో అందరికీ దగ్గరయిన ప్రదీప్ రంగనా థన్ తమిళంలో 'డ్రాగన్' మూవీ చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం బా క్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో అనుపమతోపాటు కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఇంతలోనే దక్షిణాది భాషల్లో ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతున్నా రు. మార్చి 21 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ తీసుకున్న దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. తెలుగులో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.