Salman Khan : నన్ను చంపేందుకు బిష్ణోయ్ ప్రయత్నం: సల్మాన్ ఖాన్

Update: 2024-07-25 06:45 GMT

తనతో పాటు కుటుంబాన్ని చంపేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi ) ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) అన్నారు. తన ఇంటిపై దాడితో ఈ విషయమై అర్థమైందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన బంధువులను ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై బైక్‌పై వచ్చిన వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు 1700లకుపైగా పేజీలతో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కాల్పులు జరిగిన ఏప్రిల్‌ 14వ తేదీన ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్‌ అందులో పేర్కొన్నారు. తెల్లవారుజామున 4.55కు ఇద్దరు సాయుధ దుండగులు బైక్‌పై వచ్చి, మొదటి అంతస్తు బాల్కనీపై కాల్పులు జరిపిన విషయాన్ని బాడీగార్డ్‌ వచ్చి తనకు చెప్పినట్లు వివరించారు.

Tags:    

Similar News