Samantha Posts : నాగచైతన్య పెళ్లి.. సామ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Update: 2024-12-05 12:00 GMT

నాగచైతన్య, శోభిత వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సమంతపై పడింది. ఈ జంటకు ఆమె విషెస్ చెప్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. అందుకోసం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ సామ్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ‘ఫైట్ లైక్ ఏ గర్ల్' ట్యాగ్ తో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఓ బాలిక, బాలుడు రెజ్లింగ్ తలపడుతున్నారు. ఇందులో బాలిక బలంగా ఒక్క పట్టుతో బాలుడిని కిందపడేసింది. దీంతో బాలికలు పట్టు బడితే అబ్బాయిలు తలవంచాల్సిందే అనేలా ఆ పోస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో, ట్యాగ్ పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News