Samantha and Raj : ఒకే కారులో సమంత రాజ్... త్వరలోనే పెళ్లి..?

Update: 2025-07-31 08:45 GMT

నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సమంత రాజ్ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఐతే తరచూ డైరెక్టర్ రాజ్ తో ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సమంత. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ ఇద్దరూ తరచుగా కలిసి కనిపించడంతో ఎవరికి తోచింది వాళ్ళు రాసుకుంటున్నాయి. ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇటీవ‌లే అమెరికా వెకేషన్ లో ఇద్దరు కలిసి కనిపించగా... మ‌రో ఫొటోలో ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌న కూర్చొని క‌నిపించారు. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా ఈ జంట ఇప్పుడు ఒకే కారులో క‌నిపించి మళ్ళీ అందరి దృష్టిలో ప‌డ్డారు. తన ప్రొఫెషనల్ కెరీర్ లో బిజీగా ఉన్న సమంత పర్సనల్ లైఫ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి మరి..

Tags:    

Similar News