Samantha Reaction : నాగచైతన్య పెళ్లిపై సమంత రియాక్షన్

Update: 2025-02-06 10:30 GMT

సినిమాలు, వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంటోంది హీరోయిన్ సమంత. తన ఆలోచనలు, తన జీవితం గురించి స్పష్టమైన అవగాహన ఉందని చెబుతోంది. రూమర్స్ పై స్పందించకుండా అభిమానులతో రెగ్యులర్ లో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ వస్తుంది సమంత. తను పాత రిలేషన్ షిప్ నుండి బయటకు వచ్చి కొత్త జీవితంలో కొనసాగడానికి ఎంతో శ్రమించినట్టు సమంత తెలిపింది. మీ మాజీ భాగస్వామి నాగచైతన్య కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. అసూయ పడుతున్నారా అన్న ప్రశ్నకు సమంత బదులిచ్చింది. తన జీవితంలో ఎలాంటి అసూయకు తావులేదని.. అసూయ లైఫ్ లో భాగం కావడం కూడా ఇష్టం ఉండదని తెలిపింది. అసూయ అన్ని సమస్యలకు కారణం అని భావిస్తాననని క్లారిటీ ఇచ్చేసింది సమంత.

Tags:    

Similar News