Shanmukh Jaswanth: నేను విన్నర్ అవ్వకపోవడానికి సిరితో ఫ్రెండ్‌షిప్పే కారణం: షణ్నూ
Shanmukh Jaswanth: బిగ్ బాస్ 5 తెలుగు అయిపోయినా కూడా ఆ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది.;
Shanmukh Jaswanth: బిగ్ బాస్ 5 తెలుగు అయిపోయినా కూడా ఆ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఇళ్లల్లో సందడి ఇంకా తగ్గలేదు. మామూలు హౌస్‌మేట్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి సెలబ్రిటీలుగా బయటికి తిరిగొచ్చిన ఈ టాప్ 5 కంటెస్టెంట్స్‌కు ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగింది. అయితే ఇంకా విన్నర్, రన్నర్ గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది.
బిగ్ బాస్ 5 మొదలయిన చాలారోజుల వరకు నామినేషన్స్‌లో ఓటింగ్స్ విషయంలో షణ్నూ టాప్‌లో ఉండేవాడు. దానికి తనకు ఉన్న సోషల్ మీడియానే కారణం అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ కొన్నాళ్లకే సన్నీ.. తన ఎంటర్‌టైన్మెంట్‌తో, రియల్ ఎమోషన్స్‌ను చూపిస్తూ.. ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రోజురోజుకీ ఫ్యా్న్ బేస్‌ను పెంచుకుంటూ విన్నర్‌గా నిలిచాడు. కానీ షణ్నూ మాత్రం రన్నర్ దగ్గరే ఆగిపోయాడు.
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత షణ్నూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడియన్స్‌లో ఉన్న పలు అనుమానాలకు, సందేహాలకు సమాధానం చెప్పాడు. అందులో భాగంగానే తాను రన్నర్‌గా నిలవడానికి సిరితో ఫ్రెండ్‌షిప్ కారణం అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు అదే నిజమంటూ సమాధానం ఇచ్చాడు షణ్నూ. తాను టాప్ 2 అవుతానని ముందే అనుకున్నానని, దానికి తాను హౌస్‌లో చేసిన చిన్నచిన్న తప్పులే కారణం అని బయట పెట్టాడు.