అక్కినేని నాగచైతన్య సతీమణి, నటి శోభిత తన బ్యూటీ సీక్రెట్స్ షేర్ చేసుకుంది. తన చర్మ సంరక్షణకు తీసుకునే జాగ్రత్తలను చెప్పేసింది. ఆనందంగా ఉంటే అందంగా కనిపిస్తామని అంటోందీ అమ్మడు. ఆత్మ విశ్వాసం కూడా మనల్ని అందంగా చూపిస్తుందని చెప్పింది. తాను తన చర్మ సంరక్షణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ పై ఆధార పడనని, సాధారణంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే చర్మాన్ని ఆరో గ్యంగా ఉంచుకుంటానని శోభిత అంటోంది. తన చర్మం ఒక్కోసారి నార్మల్ గా, మరోసారి పొడిబారుతూ ఉంటుందని దాని వల్ల తన పెదవులు వాతావరణంతో సంబంధం లేకుండా పొడి బారుతుంటాయని చెప్పింది. మొదట్లో ఆ సమస్యను అధిగమించడానికి లిప్ బాప్స్, లిప్ మాస్క్ లు వాడానని, అయినా ఫలితం లేదని శోభిత తెలిపింది. దీంతో పెదవులకు నెయ్యి రాసుకోవడం మొద లుపెట్టానని, నెయ్యి రాసుకుంటున్న దగ్గరనుంచి తన పెదవుల్లో మార్పు మొదలైందని, అప్పట్నుంచి ప్రతీ రోజూ ఉదయం లేవగానే తాను మొదటిగా చేసే పని అదేనని శోభిత చెప్పింది. నెయ్యి రాసుకోవడం వల్ల పెదవులకు సహజంగానే తేమ అంది, మంచి రంగును అందిస్తాయని చెప్తోంది. పొడిబారిన చర్మానికి తాను కొబ్బరి నూనెను వాడతానని, దాని వల్ల దద్దుర్లు, దురద లాంటివి రావని, కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుందని శోభిత తెలిపింది. నూనె తో కొన్ని నీళ్లు కలిపి దాన్ని జుట్టుకు స్ప్రే చేస్తే జుట్టు మళ్లీ నార్మల్ గా మారుతుందని చెప్పింది. జుట్టుకు కొబ్బరినూనె తో మర్దన చేసుకోవడం వల్ల తన కున్న మైగ్రేన్ సమస్య నుంచి బయటపడినట్టు తెలిపింది.