Shrihan : రూమర్లకి చెక్.. సిరి బాయ్‌ఫ్రెండ్ ఎమోషనల్ పోస్ట్..!
Shrihan : తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికారు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ .. బాగా అలోచించి, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టుగా వెల్లడించారు.;
Shrihan : తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికారు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ .. బాగా అలోచించి, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టుగా వెల్లడించారు. దీనితో శ్రీహాన్ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెపుతాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు సోమవారం(జనవరి3)న సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి రూమర్స్ కి చెక్ పెట్టాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. శ్రీహాస్ తాజా పోస్ట్ తో వీరిద్దరూ విడిపోవడం లేదని, వచ్చినవన్ని కేవలం రూమర్స్ అని నెటిజన్లు భావిస్తున్నారు.