Bigg Boss 5 Telugu: ఎదురుగా వచ్చి నిలబడ్డా బాయ్‌ఫ్రెండ్‌కు మొహం చూపించలేకపోయిన సిరి..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్యామిలీ వీక్ చాలా సరదాగా సాగిపోయింది.;
Siri Hanmanth (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్యామిలీ వీక్ చాలా సరదాగా సాగిపోయింది. ఇన్నిరోజులు వేర్వేరు మనస్తత్వాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య గడిపిన హౌస్‌మేట్స్.. వారి ఫ్యామిలీని చూడగానే ఎమోషనల్ అయిపోయారు. బిగ్ బాస్ మొత్తం ఫ్యామిలీ వీక్ అనేది చాలా స్పెషల్. హౌస్‌మేట్స్, వారి ఫ్యామిలీతో ఏం పంచుకుంటారా అనే ఆసక్తి అందరితో ఉంటుంది.
బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్‌లో వచ్చిన వారందరూ ఎంతోకొంత వినోదాన్ని పంచే వెళ్లారు. కానీ సిరి, షన్నూల ఫ్యామిలీస్ వచ్చినప్పుడే హౌస్ వాతావరణం కాస్త సీరియస్‌గా మారింది. సిరి, షన్నూల రిలేషన్ గురించి సిరి వాళ్ల అమ్మ మాత్రమే కాదు షన్నూ వాళ్ల అమ్మ కూడా కొంచెం సీరియస్ అయ్యారు. అయితే ఈ విషయంపై వారిని ప్రేమించిన వారు ఎలా స్పందిస్తారో తెలుసుకుందామని ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తు్న్నారు.
కానీ ఫ్యామిలీ వీక్‌లో సిరి, షన్నూ ఇద్దరి తల్లులు మాత్రమే రావడం వల్ల ప్రేక్షకులు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ బిగ్ బాస్ అంటే ఎప్పుడూ హౌస్‌మేట్స్‌కు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉంటాడు. అందుకే హౌస్‌మేట్స్‌కు ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత కూడా వారి సన్నిహితులను కలవడానికి మరొక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.
ఈరోజు(శనివారం' ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ సన్నిహితులను, ఫ్యామిలీని స్టేజ్‌పైకి ఆహ్వానించాడు నాగార్జున. వారిని చూసి హౌస్‌మేట్స్ అంతా మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే సిరి తరఫున తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ స్టేజ్‌పైకి వచ్చాడు. తనను చూసిన సిరి ఒక్కసారిగా మొహం చూపించకూండా ఏడ్చేసింది. అప్పుడు శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా అంటూ అడిగాడు. అది సరదాగా అడిగిన ప్రశ్నా.. లేక సీరియస్‌గానే అడిగాడా అని నెటిజన్లు సందేహంలో ఉండిపోయారు.