నా పెళ్లి నా ఇష్టం అంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha ). ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రేమలో ఉందని, ఇదే నెలలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె తండ్రి శత్రుఘన్ సిన్హా సైతం స్పందించారు.
తాజాగా సోనాక్షి సిన్హా సైతం స్పందిస్తూ స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది. ఇటీవలే 'బడే మియా చోటే మియా', 'హీరామండి' చిత్రాలతో సోనాక్షి ప్రేమక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రచారం కోసం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మీడియా తీరుపై కొంత సీరియస్ అయింది. తన వ్యక్తిగత విషయాలు ప్రస్తావించకూడదని కోరింది. తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ తో ఉన్న సాన్నిహిత్యంపై స్పందించేందుకు నిరాకరించింది.
ప్రేమ, పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయం అని, అందరూ ఎందుకని ఉత్సాహం చూపుతున్నారో తనకు అర్ధం కావడం లేదని చెప్పింది సోనాక్షి.