Tamannaah : అజయ్ దేవగన్ సినిమాలో తమన్నా ఐటం సాంగ్!

Update: 2025-04-02 12:45 GMT

మిల్కీ బ్యూటీ తమన్న ఓ ఐటం సాంగ్ లో నటించబోతోంది. అజయ్ దేవగన్ సరసన ఆడిపాడబోతోందీ అమ్మడు. అజయ్ సరసన గతంలో 'హిమ్మత్ వాలా' హిందీ రీమేక్ లో నటించిందీ బ్యూటీ. ఇప్పుడు అజయ్ దేవగన్ తాజా చిత్రం 'రైడ్ 2'లో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతోంది. ఈ పాటలో తమన్నాతో పాటు యో యో హనీసింగ్ కూడా డ్యాన్స్ చేస్తాడని తెలుస్తోంది. 'స్త్రీ 2' మూవీలోని తమన్నా ఐటమ్ సాంగ్ 'ఆజ్ కీ రాత్' కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన విజయ్ గంగూలీ దీనికి డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ వారంలో రెండు రోజుల పాటు ముంబై స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ ఉంటుంది. 2018లో వచ్చిన 'రైడ్' సినిమానే ఆ మధ్య రవితేజ 'మిస్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ చేశాడు. ఇప్పుడీ 'రైడ్ 2' మే 1న విడుదల కాబోతోంది.

Tags:    

Similar News