బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు ( Actress Hema ) షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. నటి హేమ రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై బెంగళూరు కోర్టులో విచారణ జరిగింది.
ఆమె నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని కోర్టుకు తెలిపారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర విభాగ పోలీసులు సీసీబీ న్యాయ వాది కోర్టుకు సమర్పించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ రావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదల అయ్యారు.