Allu Arjun : మీ అందరి ప్రేమకు థ్యాంక్స్.. ఆమె కుటుంబానికి అండగా ఉంటా..అల్లు అర్జున్
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్‌గా జరిగిందని మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ చెప్పారు. గడిచిన 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్‌కి వెళ్లి సినిమా చూశానని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకరు చనిపోవడం దురదృష్టకరం అని, దానికి తాను చింతిస్తున్నానన్నారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక దీనిపై మాట్లాడాలేనని బన్నీ అన్నారు. అరెస్ట్ సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, మీడియాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.